Tekmal : మహిళా ఐక్యత సేవా కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ

Tekmal : టేక్మాల్ లో మహిళా ఐక్యత సేవా కేంద్రం భవన నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన సాధించడానికి డ్వాక్రా సంఘాలు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ఆ సంఘాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మరమేష్, సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, టౌన్ అధ్యక్షులు భక్తుల కిషోర్, కోపరేటివ్ మాజీ డైరెక్టర్ ఆశిలి విద్యాసాగర్, వార్డ్ మెంబర్ నాగులపల్లి … Read more

ఇరుముడులతో శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇరుముడులతో శ్రీశైలం బయలుదేరిన శివ స్వాములు మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలో బోడ్మట్ పల్లి నుంచి శివస్వాములు శ్రీశైలం బయలుదేరారు. శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానంలో మండల కాలంగా శివ స్వాములు భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో శివదీక్ష చేపట్టారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి ముడుపులను ముట్టజెప్పి దీక్ష విరమించనున్నారు. ఇందుకోసం బుధవారం సుమారు 20 మంది శివ స్వాములు ఇరుముడులు కట్టుకొని శ్రీశైలం బయలుదేరారు. ముందుగా … Read more

Tekmal: టేక్మాల్ లో కార్మికుల సార్వత్రిక సమ్మె

Tekmal:కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె (Nationwide Strike)కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా టేక్మాల్ లో సీఐటీయూ (CITU)ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ వర్కర్లను, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ … Read more

ఎలకుర్తి గ్రామ సభలో కీలక తీర్మానాలు

ఎలకుర్తి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. మురికి కాలువల శుభ్రత, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు మూతలు, ఇండ్ల నిర్మాణానికి పంచాయతీ అనుమతి తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అవసరమైన చోట కరెంట్ స్తంభాలు మంజూరు, రోడ్ల సరిహద్దులు దాటి నిర్మించిన ఇండ్లపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఆరోగ్య సబ్‌సెంటర్, అంగన్వాడీ, ఐకేపీ భవనాల నిర్మాణం, ఏటిగడ్డకు మట్టి రోడ్డు, కట్టల మరమ్మతులు, బ్రిడ్జి నిర్మాణం వంటి పనులకు గ్రీన్ … Read more

Alladurg : అల్లాదుర్గంలో చిరుతపులి సంచారం

Alladurg: అల్లాదుర్గం మండలంలో చిరుత పులి (Leopard) సంచరిస్తుందన్న విషయం వాస్తవమేనని శంకరంపేట్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీ శాఖ అధికారులు చిరుత సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించి, ఆనవాళ్ళను గుర్తించారు. అనంతరం సమీప తండా ప్రజలకు పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గొల్ల కుంట తండా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లినట్లు గుర్తించారు. పశువులను మేపడానికి వెళ్లేవారు, గొర్ల కాపరులు , వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు, … Read more

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని BLN ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బ్రీఫింగ్ కార్యక్రమంలో పోలీసు సిబ్బందికి ఆయన దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, మందుగుండు సామగ్రి, ఇంక్ బాటిళ్లు, వాటర్ బాటిళ్లు తీసుకువెళ్లడం నిషేధమని, పోలింగ్ బూత్‌లో సెల్ఫీలు దిగడంపై పూర్తిగా నిషేధం ఉంటుందని తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే … Read more

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పోరుకు సర్వం సిద్ధం!

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికల నగారా మోగింది. బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్ణయించనున్నారు. భద్రత మరియు పర్యవేక్షణ: ఎన్నికల నిర్వహణను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎన్నికల కమిషన్ కార్యదర్శి మంద మకరంద్ స్వయంగా పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బీ గీతే సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వర్గీకరణ: | మున్సిపాలిటీ | సాధారణ … Read more

Tekmal : ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో స్వయం పాలన

Tekmal: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తమ తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. కలెక్టర్ గా కళ్యాణ్, డిప్యూటీ కలెక్టర్ గా అశ్వంత్, జిల్లా విద్యాధికారి గా కె.అర్చన, డిప్యూటీ విధ్యాదికారి గా శివ చరణ్ గౌడ్, మండల విద్యాధికారిగా ప్రసన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా లిఖిత, ఉపాధ్యాయులుగా సాయినిహాల్, రాధిక, రసజ్ఞ, ప్రవళిక,హరికృష్ణ, నాగరాజు, ఆంజనేయులు, శ్రీహరి,సతీష్, … Read more

Tekmal : స్వయం పరిపాలనతో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు

Tekmal : స్వయం పరిపాలనతో విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయులు కె.బాల్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని శేరిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. 5వ తరగతి విద్యార్థులు వివిధ బాధ్యతలను చురుకుగా పోషించారు. కలెక్టర్‌గా ధరణి, డీఈవోగా శ్రీనాథ్, ఎంఈఓగా మధు, కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్‌గా దీక్షిత, పాఠశాల హెడ్‌మాస్టర్‌గా భాస్కర్ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఉపాధ్యాయుల పాత్రలను విద్యార్థులే స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ … Read more

Tekmal : నేడు గంగమ్మ దేవాలయం వార్షికోత్సవం

Tekmal : మెదక్ (Medak) జిల్లా మండల కేంద్రమైన టేక్మాల్ లోని చిన్న చెరువు ఆవరణలో ఉన్న గంగమ్మ దేవాలయం వార్షికోత్సవాన్ని నేడు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రంగులు వేశారు. రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అందంగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఉదయం 10గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం బోనాలను అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి భజన కార్యక్రమం … Read more