ఎలకుర్తి గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై పలు కీలక తీర్మానాలు ఆమోదించారు. మురికి కాలువల శుభ్రత, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లకు మూతలు, ఇండ్ల నిర్మాణానికి పంచాయతీ అనుమతి తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అవసరమైన చోట కరెంట్ స్తంభాలు మంజూరు, రోడ్ల సరిహద్దులు దాటి నిర్మించిన ఇండ్లపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.
ఆరోగ్య సబ్‌సెంటర్, అంగన్వాడీ, ఐకేపీ భవనాల నిర్మాణం, ఏటిగడ్డకు మట్టి రోడ్డు, కట్టల మరమ్మతులు, బ్రిడ్జి నిర్మాణం వంటి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమావేశంలో సర్పంచ్ దేవప్రసాద్, ఉపసర్పంచ్ వాణి నవీన్, సెక్రటరీ సత్యనారాయణ, వార్డు సభ్యులు గౌండ్ల జ్యోతి యాదవ్ గౌడ్, ఎర్రోళ్ల దుర్గయ్య, ఎం. ప్రభాకర్, కుర్తి రాజు రెడ్డి, షాదుల్, కుర్తి మహేష్ రెడ్డి, వేముల అనిత, ప్రమీల, మౌనికతో పాటు అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.