Dr Malayashri Passes Away ప్రముఖ కవి, రంగస్థల నటుడు డాక్టర్ సంఘని మలయశ్రీ (రేకుర్తి) మరణం పట్ల కళాకారులు, ప్రజా సంఘాల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
Dr Malayashri Passes Away ఘనంగా నివాళులర్పించిన గడిపె మల్లేశ్
శనివారం రేకుర్తిలోని మలయశ్రీ నివాసానికి చేరుకున్న టీవీ, రేడియో జానపద గాయకులు, సిపిఐ సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి గడిపె మల్లేశ్, ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గడిపె మల్లేశ్ మాట్లాడుతూ.. మలయశ్రీ మరణం కళారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. హుస్నాబాద్‌కు చెందిన సీనియర్ కథక్ నాట్యచార్యులు, ‘నాట్య రత్న’ రజనీశ్రీతో కలిసి పౌరాణిక నాటకాల్లో అనేక పాత్రలు పోషించి మెప్పించారని గుర్తు చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, అనేక పుస్తకాలు రచించి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
Dr Malayashri Passes Awayహుస్నాబాద్ కళాకారుల సంతాపం
మలయశ్రీ మరణవార్త తెలియగానే హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు కళాకారులు, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బొయిని అశోక్ తో పాటు సీనియర్ కళాకారులు వరుకోలు కళాచందర్, పిట్టల తిరుపతి, గజ్జేల కనకయ్య, తిప్పర్తి శ్రీనివాసులు, డాక్టర్ తైదల అంజయ్య, సినీ గేయ రచయిత బోయిని సంపత్ తదితరులు ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాల ఆగయ్య, దేవర కనకయ్య, శ్రీదాస్యం లక్ష్మయ్య, పార్నంది రవీందర్, నాధమునుల రామారావు, కస్పోజు సంజీవచారి, నారోజు చంద్రమౌళి, వలువొజు జగదీశ్వరాచారీ, బత్తుల చంద్రమౌళి, మోరే కనక చంద్ర, ఎర్రమరాజు దేవరాజు, ఖాత ఎలీషా, బస్వపత్రి లక్ష్మయ్య, కల్లేం లక్ష్మణ్, తాండూరి సురేష్, చిట్టి దేవేందర్ రెడ్డి, పిట్టల మధు, తూర్పాటి మహేందర్, కత్తి ద్రాక్షాయిని, దుడ్డేల సమ్మయ్య, కొడముంజ రవీందర్, గొల్లపల్లి వినోద్, బొనగిరి శ్రీకాంత్, గద్ద సంపత్, మంద రవీందర్ తదితరులు ఉన్నారు.