Tekmal : ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో స్వయం పాలన

Tekmal: మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని ఎలకుర్తి ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తమ తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. కలెక్టర్ గా కళ్యాణ్, డిప్యూటీ కలెక్టర్ గా అశ్వంత్, జిల్లా విద్యాధికారి గా కె.అర్చన, డిప్యూటీ విధ్యాదికారి గా శివ చరణ్ గౌడ్, మండల విద్యాధికారిగా ప్రసన్న, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా లిఖిత, ఉపాధ్యాయులుగా సాయినిహాల్, రాధిక, రసజ్ఞ, ప్రవళిక,హరికృష్ణ, నాగరాజు, ఆంజనేయులు, శ్రీహరి,సతీష్, బీరప్ప, సుప్రజ,సుప్రియ, అమ్రా, ఆసియా, సంకీర్తన,అలంక్రిత, సాత్విక, శివానీ, శ్రీజ, శ్రావణి, సంతోష్, సతీష్, శ్రీకాంత్, పృథ్విరాజ్, నరేందర్, శ్రావ్య, మానస, నిహారిక, అర్చన, సావిత్రి,వినోద,దిలీప్, మనోజ్,అబేద్, వేణు, వెంకటేష్ వ్యవహరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. అమరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు రమేష్, శాంసన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సిద్దార్థ్ శంకర్ రావు, శ్రీవిద్య, సమీర్ అలీ, అరుణ, శేఖర్, నరేష్ లు పర్యవేక్షించారు.