Tekmal:కార్మికుల సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె (Nationwide Strike)కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా టేక్మాల్ లో సీఐటీయూ (CITU)ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మల్టీ పర్పస్ వర్కర్లను, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలన్నారు. ఈఎస్‌ఐ (ESI), ఈపీఎఫ్ (EPF),ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింత సదానందం, దమ్మి గారి అశోక్, తుడుము లక్ష్మయ్య, రామని యాదమ్మ, రాముని సత్తెమ్మ, ఎర్రోళ్ల దుర్గమ్మ, చింత దుర్గమ్మ, తదితరులు ఉన్నారు.