Telangana New Ration Card 2026: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ఇలా…

Telangana New Ration Card 2026: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. కొత్త దరఖాస్తు చేసుకు లబ్ధిదారులకు రేషన్ కార్డు మంజూరవుతుంది. అలాగే కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లను సైతం చేర్చడానికి అవకాశం కల్పించింది. ప్రస్తుత పరిస్థితి (ఫిబ్రవరి 2026): ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. దీనికి సంబంధించి మీరు గమనించాల్సిన ముఖ్య విషయాలు: దరఖాస్తు ఎక్కడ చేయాలి?: … Read more

BJP : కరీంనగర్ కార్పొరేషన్ లో 35కు చేరిన బీజేపీ బలం

కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ బలం 35కు చేరుకుంది. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ తనదైన వ్యూహంతో ముందుకెళ్లారు. 66 స్థానాలకుగాను 30 సొంతంగా గెలుపొందింది. ఫలితాల వెలువడ్డ కొద్దిసేపటికే 4గురు ఇండిపెండెంట్లు, ఒక ఏఐఎఫ్ బి కార్పొరేటర్ బీజేపీలో చేరాను. నేడు మరో 5 గురు కార్పొరేటర్లు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. మొత్తం 66 స్థానాలకు గాను బీజేపీ సొంతంగా 30 … Read more

జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గం హవా… పనిచేసే నాయకునికి పార్టీతో అవసరమా?

​జగిత్యాల రాజకీయ గడ్డపై జీవన్ రెడ్డి తిరుగులేని నాయకుడని ఆయన అనుచరులు మరోసారి చాటి చెప్పారు. తాజా ఫలితాల్లో జీవన్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. పార్టీ అండ ఉన్నా లేకున్నా, నాయకుడిపై నమ్మకంతో బరిలోకి దిగి భారీ విజయాలను నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం నిజాయితీగా పనిచేసే జీవన్ రెడ్డిని కాదని బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన సంజయ్ కుమార్ వర్గానికే కాంగ్రెస్ పార్టీ అండదండలు, … Read more

ఏడుపాయల జాతర ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ రాహుల్ రాజ్

ఏడుపాయల జాతర ఏర్పాట్లను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఏడుపాయల జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లాస్థాయి అధికారులతో కలిసి ఏడుపాయలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. జాతరకు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున … Read more

TIMS : సనత్‌నగర్ టిమ్స్‌ ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజనర్సింహ రివ్యూ

సనత్‌నగర్ టిమ్స్‌ ఏర్పాట్లపై మంత్రి దామోదర్ రాజనర్సింహ రివ్యూ నిర్వహించారు. ఉగాదికి ప్రారంభించడానికి మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. సిద్ధమైన 16 ఆపరేషన్ థియేటర్లు రెడీగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌‌ఐ మిషన్లు గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్ అవయవమార్పిడి కోసం ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ … Read more

SPM : ఎస్పీఎం టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామ శివారులోని ఎస్పీఎం (SPM) టైర్ల రీసైక్లింగ్ కంపెనీలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది.  కంపెనీ ఆవరణలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన పాత టైర్లకు మంటలు అంటుకోవడంతో అవి వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ లోపు పక్కనే ఉన్న గ్రామస్తులు కూడా … Read more

Alladurg : అల్లాదుర్గంలో చిరుతపులి సంచారం

Alladurg: అల్లాదుర్గం మండలంలో చిరుత పులి (Leopard) సంచరిస్తుందన్న విషయం వాస్తవమేనని శంకరంపేట్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీ శాఖ అధికారులు చిరుత సంచరిస్తున్న ప్రదేశాలను పరిశీలించి, ఆనవాళ్ళను గుర్తించారు. అనంతరం సమీప తండా ప్రజలకు పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు పాటించాలన్నారు. గొల్ల కుంట తండా సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత వెళ్లినట్లు గుర్తించారు. పశువులను మేపడానికి వెళ్లేవారు, గొర్ల కాపరులు , వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులు, … Read more

కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ను విస్మరించింది

Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తుంగలో తొక్కుతోందని భారత రాష్ట్ర సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదినిని కలిసి, అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి కాంగ్రెస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని … Read more