Leopard movement in Velpugonda మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామ పరిసరాల్లో పులి సంచరిస్తుండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి బొల్లికుంట తాండా సమీపంలో పులి సంచరించినట్లు తండావాసులు గుర్తించారు. పులి గ్రామానికి అతి సమీపంలోకి రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు
బొల్లికుంట తండాకు చెందిన పూల్యానాయక్ సోమవారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లే క్రమంలో దారిలో నిద్రిస్తున్న పులిని చూసినట్లు స్థానికులకు చెప్పాడు. దీంతో భయాందదోళన చెందిన వారు వెంటనే స్థానిక సర్పంచ్ కు సమాచారాన్ని అందజేశారు.
Leopard movement in Velpugonda పులి సంచారం నేపథ్యంలో గ్రామ సర్పంచ్ అధికారులను అప్రమత్తం చేశారు. వేల్పుగొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించారు. ఫారెస్టు అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
- పశువుల కాపరులకు సూచన: పశువులను అటవీ ప్రాంతం వైపు తోలుకెళ్లవద్దని, ఒంటరిగా అడవిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.
- జాగ్రత్తలు: రాత్రి సమయాల్లో పొలాల వద్దకు వెళ్లరాదని, ఇంటి పరిసరాల్లో వెలుతురు ఉండేలా చూసుకోవాలని గ్రామస్థులకు సూచించారు