Tekmal Gram Panchayat Auction 2026: టేక్మాల్ తైబజార్ వేలంతో రూ. 71 లక్షలు దాటిన ఆదాయం

Tekmal Gram Panchayat Auction 2026 : మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం తైబజార్ వేలం నిర్వహించారు. వేలం పాట నువ్వా… నేనా అన్నట్లు పోటా పోటీగా సాగింది. అధికారులు, పాలకవర్గం, గ్రామస్తుల సమక్షంలో వేలం పాటను నిర్వహించడం జరిగిందని గ్రామపంచాయతీ ఈవో రాకేష్ కుమార్ తెలిపారు.

Tekmal Gram Panchayat Auction 2026 వేలం వివరాలు ఇలా ఉన్నాయి

  • మేకలు-గొర్రెల సంత: ఈ వేలంలో అత్యధిక ధర పలికింది మేకలు, గొర్రెల మార్కెట్. గుంటి శ్రావణ్ అత్యధికంగా రూ. 46 లక్షలకు ఈ సంతను దక్కించుకున్నారు.
  • పశువుల సంత: పశువుల సంత వేలం కూడా ఆసక్తికరంగా సాగింది. తలారి బాలరాజు రూ. 15 లక్షలకు దీనిని కైవసం చేసుకున్నారు.
  • కూరగాయల మార్కెట్: గ్రామానికి చెందిన చల్ల నర్సిములు రూ. 10,25,100 వెచ్చించి తైబజారును సొంతం చేసుకున్నారు.

వేలం ప్రక్రియ అంతా పారదర్శకంగా, గ్రామస్థుల సమక్షంలోనే పూర్తి చేసినట్లు ఈవో వెల్లడించారు.