Farmer Died Due to Electric Shock : టేక్మాల్ లో కరెంట్ షాక్ తో రైతు మృతి

Farmer Died Due to Electric Shock : టేక్మాల్ మండలంలో విద్యుత్ షాక్ తో రైతు మృతి మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధి షాబాద్ తండాలో విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతిచెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది.

Farmer Died Due to Electric Shock

Farmer Died Due to Electric Shock

షాబాద్ తండాకు చెందిన రమావత్ మోత్యా (55) వ్యవసాయం చేసుకుంటూ జీవాన్ని పొందుతున్నాడు. తనకున్న రెండెకరాల వ్యవసాయ పొలంలో వరి సాగు చేశాడు. వరి పంటకు నీళ్లు పెట్టడానికి మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో విద్యుత్తు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

పొలానికి వెళ్లిన వ్యక్తి ఎంతకు తిరిగి రాకపోవడంతో అతని భార్య పొలానికి వెళ్లి చూసే సరికి విగత జీవిగా పడి వున్నాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.

బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై అరవింద్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.