Thamplur Kabaddi Tournament : యువత క్రీడల్లో రాణించాలి: కాంగ్రెస్ నాయకులు సర్వాణి లక్ష్మణ్

Thamplur Kabaddi Tournament : యువత క్రీడల పట్ల ఆసక్తిని కనబర్చి, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో రాణించాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సర్వాణి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. తంప్లూర్ గ్రామంలో ఉగాది ఉత్సవాలు మరియు దుర్గామాత జాతరను పురస్కరించుకుని నిర్వహించిన గ్రామ స్థాయి కబడ్డీ టోర్నమెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో అద్భుతమైన ప్రతిభ దాగి ఉందని, అలాంటి వారిని ప్రోత్సహించడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, క్రమశిక్షణకు కూడా దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

హోరాహోరీగా ఫైనల్ పోరు: గ్రామ స్థాయి జట్ల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ చరణ్ యాదవ్ వర్సెస్ ఆకుల హర్షవర్ధన్ జట్ల మధ్య అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చరణ్ యాదవ్ జట్టు విజేతగా నిలిచింది.

Thamplur Kabaddi Tournament బహుమతుల ప్రధానం

రన్నరప్‌గా నిలిచిన ఆకుల హర్షవర్ధన్ జట్టుకు మరియు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు ట్రోఫీ మరియు ₹3,000 నగదును అందజేసి అభినందించారు. విజేతగా నిలిచిన చరణ్ యాదవ్ జట్టుకు ట్రోఫీతో పాటు ₹5,000 నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నారాయణ యాదవ్, క్రీడాకారులు, స్థానికులు ఉన్నారు.