Civil Rights Day in Bardipur : బర్దిపూర్‌లో పౌరహక్కుల దినోత్సవం.. చట్టాలపై అవగాహన కల్పించిన అధికారులు

Civil Rights Day in Bardipur : సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని, కులమతాలకతీతంగా సామరస్యంగా జీవించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ ( Medak ) జిల్లా, టేక్మాల్ (Tekmal) మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామంలో ‘పౌరహక్కుల దినోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ సాయి శ్రీకాంత్, స్థానిక పోలీసు అధికారులు పాల్గొని గ్రామస్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలపై విస్తృత అవగాహన కల్పించారు.

కులమతాల పేరుతో ఒకరినొకరు దూషించుకోవడం చట్టరీత్యా నేరమని, అందరూ సోదరభావంతో మతసామరస్యాన్ని చాటాలని అధికారులు కోరారు. ఎవరైనా ఇతరుల హక్కులకు భంగం కలిగించినా లేదా వివక్షకు గురిచేసినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామరస్యపూర్వక జీవనం అనేది కేవలం ఒకరి బాధ్యత కాదని, అది సమాజంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతని అధికారులు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Civil Rights Day in Bardipur