Tekmal : బర్ధీపూర్ చెరువులు, కట్టు కాలువల మరమ్మత్తులకు అంచనాలు


Tekmal: వ్యవసాయానికి సాగు నీరు అందించడానికి కాలువల మరమ్మత్తుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలమేరకు ఇరిగేషన్ అధికారులు సిద్దమయ్యారు. పూర్తి వర్షాధారంపై ఆధారపడి వ్యవసాయం సాగు చేసుకుంటున్న రైతులకు కాలువ ద్వారా సాగు నీరు అందుతుంది. అయితే కాలువలకు అవసరమైన మరమ్మత్తులు చేయాల్సిన పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా బర్దిపూర్ గ్రామంలో ఫీడర్ ఛానల్ ను కట్టు కాలువ ఇసుక వాగు నుండి దేవుని చెరువు వరకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది.

అదే విధంగా మామిడి బాయి నుండి ఊర చెరువులోకి నీటి కాలువను మరమ్మత్తు చేయనున్నారు. ఈ మేరకు అవసరమైన అంచనాలను రూపొందించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఏఈ సుప్రియ, సర్పంచ్ సాయిబాబా, మండల మాజీ వైస్ ఎంపీపీ పి విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం సంగమేశ్వర్, ఉప సర్పంచ్ శంకరయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ వార్డు మెంబర్, గోపాల్ రైతులు, సూరయ్య, విష్ణువర్ధన్, రవికుమార్, శంకర్, రాములు, కార్యాలయ సిబ్బంది మంజుల, తదితరులు ఉన్నారు.