Alladurgam : అల్లాదుర్గంలో ముదిరాజ్ నాయకుల ముందస్తు అరెస్టు

Alladurgam అసెంబ్లీ ముట్టడికి ముదిరాజ్ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో శుక్రవారం ఉదయం ముదిరాజ్ సంఘం నాయకులను పోలీసులు వారి ఇళ్లవద్దే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముదిరాజులను బీసీ-డీ నుండి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ముట్టడిని అడ్డుకోవడానికి ముందస్తుగా అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ముదిరాజులను రాజకీయంగా అణగదొక్కాలని చూస్తే పోరాటం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అల్లాదుర్గం పోలీసులు అరెస్టు చేసిన వారిలో కనకంటి భూమయ్య (మండల అధ్యక్షుడు), బాధనే బేతయ్య (ప్రధాన కార్యదర్శి), మురడి రాములు (అల్లాదుర్గం అధ్యక్షుడు), కొన్నాళ్ల బుచ్చయ్య (ఉపాధ్యక్షులు), దొంత లక్ష్మయ్య ముదిరాజ్ సంఘం( గౌరవ అధ్యక్షులు ), ముదిరాజ్ సంఘం నాయకులు బోయిని సత్తయ్య, కళాయి శ్రీనివాస్, మురాడి చిన్న రాములు, బోయిని బాగయ్య, కాటి లక్ష్మణ్, బోయని బేతయ్య తదితరులు ఉన్నారు.

Alladurgam