అల్లాదుర్గంలో భారీగా అక్రమ బియ్యం పట్టివేత

అల్లాదుర్గం: బీహార్ నుండి అల్లాదుర్గం మండలానికి తరలిస్తున్న అక్రమ బియ్యం లారీని ను అల్లాదుర్గం పోలీసులు పట్టుకున్నారు. బీహార్ రాష్ట్రంలోని ప్రైవేటు వ్యక్తుల నుండి దొడ్డు రకం బియ్యం లారీల్లో రవాణా చేస్తూ అల్లాదుర్గం మండలంలోని శ్రీ సాయి బిన్నీ రైస్ మిల్ కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొని స్థానిక స్టేషన్ కు తరలించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బియ్యం సుమారు 42 టన్నుల, దీని విలువ 11 లక్షల 13 వేల 77 రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. బియ్యం తరలింపుకు సంబంధించిన ధ్రువపత్రాలు సరిగ్గా లేనందున అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సివిల్ సప్లాయి అధికారులకు సమాచారం అందించి పూర్తి స్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని ఎస్సై శంకర్ తెలిపారు.