Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం… తాజా సమాచారం

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి నేడు (2026, ఫిబ్రవరి 25, బుధవారం) భక్తుల రద్దీ సాధారణం కంటే కాస్త ఎక్కువగా ఉంది. పరీక్షల సీజన్ అయినప్పటికీ, భక్తులు గణనీయంగానే తరలివస్తున్నారు. సర్వదర్శనం (ఉచిత దర్శనం) టోకెన్లు లేని భక్తులకు దర్శనం కోసం దాదాపు 12 నుండి 14 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని దాదాపు 9 కంపార్ట్‌మెంట్లు నిండి ఉన్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300/-) సుమారు 3 నుండి 4 గంటల్లో పూర్తవుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు సుమారు 6 నుండి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.

శ్రీనివాస దివ్యానిగ్రహ హోమం: మార్చి నెలకు సంబంధించిన హోమం టికెట్లను నేడు (ఫిబ్రవరి 25) ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

తిరుమలలో శ్రీవార సేవా టికెట్ల వివరాలు

ఏప్రిల్ కోటా: ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.

నిన్నటి రోజున (ఫిబ్రవరి 24) 74,902 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,869 మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.05కోట్లు
హుండీ ఆదాయం వచ్చింది.