టేక్మాల్ మండలం కుసంగి గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం సీఈఓ వెంకటేశం ఆధ్వర్యంలో పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఐసిఐసిఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతు సంఘ సభ్యులకు హార్వెస్టర్, బేలర్, ట్రాక్టర్ ను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వ్యవసాయ అధికారి రాంప్రసాద్ మాట్లాడుతూ.. రైతులు కలిసి ఉంటే సంఘం బలోపేతానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తారన్నారు. పంటల సాగుపై పూర్తి అవగాహన కలిగి ఉండి చిరుధాన్యాలు సాగు చేయాలన్నారు. కార్యక్రమంలో ఐసిఎంఆర్,- ఐఐఎంఆర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ శ్రీనివాస బాబు, సీనియర్ సైంటిస్ట్ సంగప్ప, రీసెర్చ్ అసోసియేట్ రఫీ, ఐసిఐసిఐ డెవలప్మెంట్ అధికారి శ్రీలత సిసిట్ల, రైతు సంఘం అధ్యక్షులు మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
