Sitarama Kalyanam Velpugonda : వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం
Sitarama Kalyanam Velpugonda టేక్మాల్ (మెదక్): మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలో వెలసిన శ్రీ రామాచలం గుట్టపై సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. రాజయోగి వెంకట స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు మెదక్ జిల్లా నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శాస్త్రోక్తంగా ఆధ్యాత్మిక క్రతువులు ఉదయం నుండే గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, గోపూజ, గురుపూజ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. … Read more