High Court Notices to 7 Telangana MLAs తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి మలుపు తిరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు, తాజాగా ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వివాదం ముగిసిపోయింది అనుకున్న తరుణంలో మళ్లీ న్యాయస్థానం పరిధిలోకి చేరింది.
స్పీకర్ తీర్పుపై హైకోర్టులో సవాల్:
గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇటీవల కొట్టివేసిన సంగతి తెలిసిందే. వారు పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.
High Court Notices to 7 Telangana MLAs నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు వీరే
హైకోర్టు ఆదేశాల ప్రకారం కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు High Court Notices to 7 Telangana MLAs అందుకున్నవారు
- అరికెపూడి గాంధీ
- ప్రకాష్ గౌడ్
- పోచారం శ్రీనివాస్ రెడ్డి
- కాలే యాదయ్య
- బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
- తెల్లం వెంకట్రావు
- దానం నాగేందర్
దానం నాగేందర్ కేసులో కీలక వాదనలు
బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రత్యేకంగా విచారణ జరిపింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం నాగేందర్, కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ బీ-ఫామ్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారని, ఇది స్పష్టమైన ఫిరాయింపు అని ఆయన వాదించారు. అయినప్పటికీ స్పీకర్ ఈ పిటిషన్‌ను కొట్టివేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఆ తీర్పును రద్దు చేయాలని కోరారు.
తదుపరి విచారణ ఎప్పుడు?
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్ కార్యాలయానికి కూడా కోర్టు నోటీసులు పంపింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా ఎమ్మెల్యేలు తమ కౌంటర్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.