MLA Anirudh Reddy on Ippa Puvvu Benefits తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇప్ప చెట్టు విశిష్టతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్ప పువ్వును కేవలం సారా తయారీకే కాకుండా, ఒక శక్తివంతమైన ఔషధంగా మరియు ఆర్థిక వనరుగా మార్చుకోవచ్చని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
MLA Anirudh Reddy on Ippa Puvvu Benefits ఇప్ప పువ్వు – ఆరోగ్య ప్రదాయిని
ఇప్ప చెట్టుకు 5000 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేస్తూ.. దీని ఉత్పత్తులు మనుషుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్ప పువ్వును టీలో కలిపి తాగడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు. గతంలో తండాల్లో నివసించే ప్రజలు ఇప్ప పువ్వు సారా తాగి 100 ఏళ్ల వరకు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేవారని ఆయన గుర్తు చేశారు.
ఆర్థిక వనరుగా ఇప్ప ఉత్పత్తులు
ఇప్ప పువ్వును కేవలం సారాకే పరిమితం చేయకుండా.. ఐస్‌క్రీమ్స్, కేక్స్, లడ్డూలు, బిస్కెట్లు వంటి అనేక ఆహార పదార్థాల తయారీలో వాడవచ్చని సూచించారు. ఇతర రాష్ట్రాల ఉదాహరణలను ఆయన సభ దృష్టికి తెచ్చారు. ఛత్తీస్‌గఢ్ లో సుమారు 1.6 లక్షల మంది ఇప్ప పూల సేకరణ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మధ్యప్రదేశ్ లో ‘మాండ్’ అనే డ్రింక్‌ను బాటిల్ రూ. 800 చొప్పున విక్రయిస్తూ అక్కడి ప్రజలు భారీ లాభాలు గడిస్తున్నారని తెలిపారు. అక్కడ ప్రభుత్వం శిక్షణతో పాటు యంత్రాలను కూడా అందిస్తోందని వివరించారు.
ప్రభుత్వానికి విన్నపం – ప్రత్యేక కార్పొరేషన్
రాష్ట్రంలోని ఆదివాసీలు మరియు గిరిజనులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘ఇప్ప పువ్వు ఉత్పత్తుల కార్పొరేషన్’ను ఏర్పాటు చేయాలని MLA Anirudh Reddy on Ippa Puvvu Benefits ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ కాలం నాటి పాత నిబంధనలను పక్కన పెట్టి, అత్యాధునిక పద్ధతుల్లో ఇప్ప ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.