CM Thanda School Land Encroachment : ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమణల నుంచి కాపాడాలని, కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల ఆట స్థలాన్ని ఆక్రమిస్తున్నారని చెరువు ముందరి తాండా మాజీ సర్పంచ్ రాంజానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం టేక్మాల్ Tekmal MPDO రియాజోద్దీన్ కు వినతి పత్రం ఇచ్చారు. సీఎం తాండాలోని ప్రభుత్వ పాథమిక పాఠశాలకు సంబంధించిన ఆట స్థలం అన్యాక్రంతం కాకుండా తాను సర్పంచ్‌గా పనిచేసిన 2019-2023 సమయంలో కడీలు (Fencing) ఏర్పాటు చేశానని వినతి పత్రంలో తెలిపారు. అయితే ప్రస్తుతం గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆ కడ్డీలను తొలగించి పాఠశాల స్థలాన్ని అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
