Sangareddy SP Paritosh Pankaj : సంగారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) పరితోష్ పంకజ్ ను మానవ హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పవన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణ, ప్రస్తుత పరిస్థితులపై వారు చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. సమాజంలో సామాన్యుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఎస్పీని కోరారు. మానవ హక్కుల ఉల్లంఘనపై ఎస్పీ పరితోష్ పంకజ్ సానుకూలంగా స్పందించారు. జిల్లాలో ఎవరైనా ప్రజల హక్కులను కాలరాసినా లేదా నిర్లక్ష్యం చేసినా సహించేది లేదని హెచ్చరించారు. బాధితుల పక్షాన నిలబడి, హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.