Census House : జనగణన తొలి దశలో భాగంగా చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పనను పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం టేక్మాల్ మండల కేంద్రంలో ఇండ్ల గణనకు సంబంధించిన ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్న ఇండ్ల గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Census House
ఇండ్ల గణన బ్లాకుల తయారీలో మండలంలోని ప్రతి రెవెన్యూ గ్రామాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి, గరిష్టంగా 300 ఇండ్లు లేదా 800 మంది జనాభా పరిమితిలో బ్లాకులను రూపొందించాలని తెలిపారు. ఈ ప్రక్రియను CMMS పోర్టల్ ద్వారా సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
అలాగే, జనగణన బ్లాకుల రూపకల్పనలో ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని, సాంకేతిక విధానాల అమలులో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ తులసీరాం, ఎంపీడీవో రియాజోద్దీన్, ఆర్ఐ సాయిశ్రీకాంత్, తదితరులు ఉన్నారు.