BRS : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని హరీష్ అన్న సేవాదళం జిల్లా అధ్యక్షులు జనగామ అనిల్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని ఆయన స్పష్టం చేశారు.
శాంతిభద్రతలు ఎక్కడ?
ఈ సందర్భంగా అనిల్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. “క్యాంప్ ఆఫీసులపై దాడులు చేస్తుంటే రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా?” అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ శ్రేణులు గుండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలని తెలంగాణ డీజీపీని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ, ఇలాంటి భౌతిక దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.