Babu Jagjivan Ram Jayanthi Medak : డా. సాయిలుకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం

Babu Jagjivan Ram Jayanthi Medak భారత తొలి ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మెదక్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం సమాజ సేవలో మరియు వృత్తిపరంగా విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిని జిల్లా యంత్రాంగం గౌరవించింది. ఈ క్రమంలో ఆందోల్ నియోజవర్గ దళిత జేఏసీ మాజీ ఛైర్మన్ డా.సాయిలు ను జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ శాలువాతో సన్మానించి, మెమెంటోను అందజేశారు. జగ్జీవన్ రామ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు.

Babu Jagjivan Ram Jayanthi Medak