Jyotirao Phule Jayanti PRTUTS : టేక్మాల్ లో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Jyotirao Phule Jayanti PRTUTS : సామాజిక విప్లవకారుడు, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పీఆర్టీయూ టేక్మాల్ ( PRTUTS ) శాఖ ఆధ్వర్యంలో టేక్మాల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మేడి సతీష్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పూలే ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్యకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టేక్మాల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, టేక్మాల్ మండల అధ్యక్షులు అమీరుద్దీన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఇమ్మడి నాగరాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బాధ్యులు పవన్ కుమార్, రామలింగం, వెంకటేశం, రాజు, మల్లారెడ్డి, మల్లేశం, అనిల్, రవి, మధు, సమంత, రూపకళా, రమాదేవి, గౌతమి, ఆశ్ర తదితరులు పాల్గొని పూలే సేవలను స్మరించుకున్నారు.

Jyotirao Phule Jayanti PRTUTS
Jyotirao Phule Jayanti PRTUTS