Deepak Tiwari : చౌడాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి

చౌడాపూర్ మండలంలో పర్యటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పటి అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ నవీన్ కుమార్ ఘనంగా సన్మానించారు.

బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, అలాగే పలు ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు.

మండల కేంద్రానికి విచ్చేసిన కలెక్టర్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పటి అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ పరిగి నవీన్ కుమార్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, గోపాల్, తదితరులు ఉన్నారు.

Deepak Tiwari