Free Medical Camp Tekmal : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా మెదక్ జిల్లాలోని టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( Tekmal PHC )లో రేపు (సోమవారం) మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నీరు. మెదక్ జిల్లాకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఈ శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా పరీక్షలు చేయనున్నారు.

Free Medical Camp Tekmal ముఖ్య వివరాలు
- తేదీ: 30/03/2026 (సోమవారం)
- సమయం: ఉదయం 09:00 గంటల నుండి ప్రారంభం
- వేదిక: టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)
అందుబాటులో ఉండే వైద్య విభాగాలు
ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులు రోగులకు మెరుగైన చికిత్స అందించనున్నారు:
- గైనకాలజీ: స్త్రీల ఆరోగ్య సమస్యలు.
- పీడియాట్రిక్స్: శిశు మరియు పిల్లల వైద్యం.
- జనరల్ మెడిసిన్: సాధారణ వ్యాధులు.
- ఆర్థోపెడిక్స్: ఎముకలు, కీళ్ల సమస్యలు.
- ఆఫ్తాల్మాలజీ: కంటి వైద్యం.
- డెంటిస్ట్: దంత సమస్యలు.
మండలంలోని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కె. హర్షిత కోరారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు తమ రిపోర్టులతో వచ్చి నిపుణుల సలహాలు పొందాలని సూచించారు.