Ward Member Lingam టేక్మాల్: పదవి ఉన్నా లేకున్నా.. నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండాలని టేక్మాల్‌కు చెందిన ఓ వార్డు సభ్యుడు నిరూపించారు. టేక్మాల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లగూడెం వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న పశువుల నీటి తొట్టిని వార్డు సభ్యుడు లింగం స్వయంగా శుభ్రం చేసి తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.
Ward Member Lingam అసలేం జరిగిందంటే?
గొల్లగూడెం వాటర్ ట్యాంక్ నిండిన తర్వాత ఓవర్ ఫ్లో అయ్యే నీరు వృథా పోకుండా, గతంలో పశువుల కోసం ఒక నీటి తొట్టిని నిర్మించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఈ తొట్టిని శుభ్రం చేయకపోవడంతో అది పూర్తిగా నాచు పేరుకుపోయి, అపరిశుభ్రంగా మారింది. గత్యంతరం లేక పశువులు అదే మురికి నీటిని తాగుతుండటం గమనించిన స్థానిక వార్డు సభ్యుడు లింగం చలించిపోయారు.

పంచాయతీ సిబ్బంది కోసం ఎదురుచూడకుండా, స్వయంగా రంగంలోకి దిగి మురికిగా మారిన నీటి తొట్టిని శుభ్రం చేశారు. పశువులకు స్వచ్ఛమైన నీరు అందేలా చర్యలు తీసుకున్నారు.
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
ఏ చిన్న పనికైనా అధికారుల వైపు చూసే నేటి కాలంలో, ఒక ప్రజాప్రతినిధి స్వయంగా శ్రమదానానికి పూనుకోవడం అభినందనీయమని స్థానికులు కొనియాడుతున్నారు. లింగం చేసిన ఈ పని ఇతర నాయకులకు ఆదర్శంగా నిలుస్తుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.