ఇటీవల జరిగిన అందోల్ జోగిపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఛైర్మన్ గా కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ గా చిట్టి బాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా టేక్మాల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అధ్యక్షులు నిమ్మ రమేష్, టేక్మాల్ సర్పంచ్ తిమ్మి గారి సుధాకర్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ షేక్ మజహర్, మాజీ వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, మాజీ సొసైటీ డైరెక్టర్ ఆశిల విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.