Telangana Govt WhatsApp Chatbot : ఇక ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో మీసేవ సేవలు

Telangana Govt WhatsApp Chatbot : తెలంగాణలో సామాన్యులకు మీసేవ Mee Seva ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పౌర సేవలు పొందేలా ‘వాట్సాప్ చాట్‌బాట్’ వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Telangana Govt WhatsApp Chatbot సేవలు పొందే విధానం

ప్రజలు తమ మొబైల్‌లో 80969 58096 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపితే చాలు. వెంటనే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవల మెనూ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Telangana Govt WhatsApp Chatbot

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలు

  • ధ్రువపత్రాలు: కులం, ఆదాయ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం.
  • స్టేటస్ చెక్: దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్ల స్థితిని తెలుసుకోవడం.
  • పన్నుల చెల్లింపు: మున్సిపల్ పన్నులు సులభంగా చెల్లించడం.
  • విద్యా శాఖ: ఇప్పటికే ఇంటర్, పదో తరగతి హాల్ టికెట్లను ఈ విధానం ద్వారా విజయవంతంగా అందజేస్తున్నారు.

ఒకే గొడుగు కిందకు అన్ని శాఖలు

గతంలో ఒక్కో శాఖకు ఒక్కో వెబ్‌సైట్ ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురయ్యేవారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాల వంటి కీలక శాఖల సమాచారాన్ని ప్రభుత్వం ఒకే వేదికపైకి తెచ్చింది. దీనివల్ల పాలనలో పారదర్శకత పెరగడమే కాకుండా, మధ్యవర్తుల బెడద తప్పుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

రానున్న రోజుల్లో మరిన్ని సేవలు

మున్ముందు ఈ చాట్‌బాట్ సేవలను మరింత విస్తరించాలని అధికారులు నిర్ణయించారు.

  • మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల దరఖాస్తులు.
  • రేషన్ కార్డులు, పెన్షన్ల వివరాలు.
  • ప్రభుత్వ పథకాల నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయినప్పుడు నేరుగా వాట్సాప్ అలర్ట్స్.