Tekmal: గొల్లగూడెంలో ముత్యాల పోచమ్మ ఆలయ వార్షికోత్సవం

Tekmal : మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో ముత్యాల పోచమ్మ ఆలయ 4వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తడి పోచమ్మ గ్రామ దేవతలకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయాల వార్షికోత్సవంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. డప్పు చప్పుళ్లతో మహిళలు ఘనంగా బోనాలను సమర్పించారు. పోతురాజు విన్యాసాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాడిపంటలు, పిల్ల పాపలు చల్లగా ఉండేలా దీవించమ్మా అంటూ వేడుకున్నారు. వార్షికోత్సవ మహోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్, ఉప సర్పంచ్ శంకరయ్య, గొల్లగూడెం వార్డు మెంబర్లు సాదు లింగం, కుర్మ మాణెమ్మ, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, బిఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయకోటి భాస్కర్, కిషన్ రాములు, కిష్టయ్య, శివయ్య, బీరప్ప, సత్యం, సాయిలు, మల్లేశం, నవీన్ కుమార్, ఎల్లయ్య అంజయ్య, పాపయ్య, బేతయ్య, గ్రామ ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.