Tekmal: టేక్మాల్ లో యాంటీ నార్కొటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు

Tekmal: మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో యాంటీ నార్కొటిక్ డాగ్ స్క్వాడ్ (Anti-Narcotic Dog Squad conducts searches in Tekmal) తనిఖీలను చేపట్టారు. గ్రామంలోని పలు హోటళ్లు, దుకాణాలలో గురువారం తనిఖీలు నిర్వహించారు.

Tekmal: టేక్మాల్ లో యాంటీ నార్కొటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు

పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల కేంద్రమైన టేక్మాల్ లో యాంటీ నార్కొటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, దుకాణాలలో తనిఖీ చేశారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు, నిషేధి పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే కలుషిత ఆహారం, నాసిరకం పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అమ్మకం చేయకూడదన్నారు.