Daughter killed mother ప్రేమ మోజులో పడి కన్నప్రేమను మరిచిందో కూతురు. నవమాసాలు మోసి పెంచిన తల్లి అని కూడా చూడకుండా, ప్రియుడితో కలిసి కన్నతల్లిని కాటికి పంపింది. హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి.. ఏమీ తెలియనట్లు నటించింది. ఏడాది కాలంగా మిస్టరీగా ఉన్న ఈ అదృశ్యం కేసు, ఒక పాత బైక్ కారణంగా వెలుగులోకి రావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
Daughter killed mother అసలేం జరిగింది?
హైదరాబాద్ శివార్లలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకుర్ భరత్ నగర్‌కు చెందిన అంజు (40) అనే మహిళ 2025 మే నెలలో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీనిపై ఆమె పెద్ద కుమార్తె జవహర్ నగర్ మరియు బొల్లారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలించినా, ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో పది నెలలుగా ఈ కేసు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
చిక్కిన క్లూ.. బయటపడ్డ అసలు రంగు
ఇటీవల నిందితుడు మౌంటీ రాజ్‌పుత్ మృతురాలికి చెందిన బైకును రాంకోఠిలోని ఒక పాత సామాన్ల షాపులో అమ్మేందుకు ప్రయత్నించాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు మౌంటీని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి.
మృతురాలి చిన్న కుమార్తె ఇషికా, మౌంటీ రాజ్‌పుత్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం అంజుకు ఇష్టం లేకపోవడంతో ఆమె వారిని మందలించింది. తమ సహజీవనానికి తల్లి అడ్డు వస్తోందని భావించిన ఇషికా, ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చాలని పక్కా స్కెచ్ వేసింది.
ఇంట్లోనే సమాధి.. ఏడాది పాటు నాటకం
నిందితులు ఇద్దరూ కలిసి అంజును అతి కిరాతకంగా చంపి Daughter killed mother, ఎవరికీ తెలియకుండా ఇంటి ఆవరణలోనే గోయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఇషికా పది నెలల పాటు నాటకమాడింది. పోలీసుల విచారణలో కూడా తనకేమీ తెలియదని బుకాయించింది. కానీ, బైక్ అమ్మే క్రమంలో ప్రియుడు దొరికిపోవడంతో ఇద్దరి పాపం పండింది.
పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని వెలికితీసే (Exhumation) ప్రక్రియను చేపట్టారు. కన్నతల్లిని కూతురే చంపి పాతిపెట్టిన ఈ ఘటన విన్న స్థానికులు నివ్వెరపోతున్నారు.