Malkapur : సి.సి. రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్ వెంకటకృష్ణ

Malkapur : మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండల పరిధి మల్కాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం (NREGS) ద్వారా మంజూరైన సి.సి. రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ వెంకటకృష్ణ బుధవారం ప్రారంభించారు.

Malkapur

గ్రామంలో మౌళిక సదుపాయాలను కల్పించి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకెళ్తామని మల్కాపూర్ సర్పంచ్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. గ్రామస్తుల సౌకర్యార్థం అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణేష్, వార్డు సభ్యులు అనిత, మాధవి, మౌనిక, మాజీ సర్పంచ్ హన్సిబాయి పాండ్య నాయక్, వీరాగౌడ్, దన్ సింగ్, రూప్సింగ్, శంకర్, వినోద్, సుదర్శన్, జీవన్, బన్సీలాల్, సురేష్, రాఘవులు, చందర్, రాజు, కిషన్ తదితరులు ఉన్నారు.