Tirumala News కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సామాన్య భక్తులకు కేటాయించిన ఉచిత దర్శనం (సర్వదర్శనం) కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లు కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు విస్తరించి ఉన్నాయి.
Tirumala News తాజా దర్శన సమయాల వివరాలు
- సర్వదర్శనం (ఉచితం): టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం 12 నుండి 15 గంటల సమయం పడుతోంది.
- టోకెన్ భక్తులు: సర్వదర్శనం టైమ్ స్లాట్ (SSD) టోకెన్లు పొందిన భక్తులకు సుమారు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది.
- శీఘ్రదర్శనం (రూ. 300/-): ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
నిన్నటి గణాంకాలు (మార్చి 26)
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించిన వివరాల ప్రకారం నిన్న స్వామివారి దర్శన విశేషాలు ఇలా ఉన్నాయి:
- దర్శించుకున్న భక్తులు: 65,600 మంది.
- తలనీలాలు సమర్పించినవారు: 24,292 మంది.
- హుండీ ఆదాయం: నిన్న ఒక్కరోజే స్వామివారికి భక్తులు కానుకల రూపంలో ₹4.18 కోట్లు సమర్పించారు.