Ex Sarpanch Arrest : పెండింగ్ బిల్లుల విడుదల కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్‌లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ జిల్లా యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రభుత్వ చేతగాని చర్య అని ఆయన విమర్శించారు.
Ex Sarpanch Arrest తెల్లవారుజామునే
మంగళవారం తెల్లవారుజామున టేక్మాల్ ఎస్ఐ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై తనిఖీలు చేపట్టారు. మాజీ సర్పంచ్‌లు నాయికోటి శ్రీనివాస్, బోరంచ సాయిలు, మాజీ సర్పంచ్ సుప్రజ భర్త భాస్కర్ ను వారి నివాసాల నుండే ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో నాయకులు వాగ్వాదానికి దిగారు.

హక్కుల కోసం పోరాడితే అరెస్టులా?
అరెస్ట్ అనంతరం నాయికోటి భాస్కర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ఇప్పటివరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. “మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఊర్లను అభివృద్ధి చేస్తే, నేడు బిల్లుల కోసం అడిగితే అరెస్టులు చేస్తారా?” అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే మాజీ సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.