శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ 399వ జయంతి సందర్భంగా టేక్మాల్ మండల పరిదిలోని వేల్పుగొండ గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ చేసేందుకు ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ రాజయోగి వెంకటస్వామి దివ్య ఆశీస్సులతో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గ్రామ సర్పంచ్, నీరుడి దాస్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణం ముందు నూతనంగా ఏర్పాటుచేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాని గ్రామ సర్పంచ్ నిరుడి దాస్ ఛత్రపతి యూత్ అధ్యక్షులు జ్ఞానాజీ గారి ప్రవీణ్ కుమార్ చేతులమీదగా విగ్రహ ఆవిష్కరణ చేశారు. అనంతరం కమిటి సభ్యులు విగ్రహ ఆవిష్కరణకు కృషి చేసిన దాతలకు ముఖ్య అతిథులకు శాలువాలతో సత్కరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ శాఖల సంఘ పెద్దలు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఏనలేనివని ఆ రాజ్యంలోని ఆడవాళ్లు అందరినీ మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు కుంకుమ చీరలు ఇచ్చేవరని అలాటి దిరుడు భారత దేశంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. దేశంలో కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎంపీ సుధాకర్, గ్రామ పాలకవర్గం సభ్యులు, ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవహా అధ్యక్షులు నాగభూషణం, ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలు, ఆర్ఎస్ఎస్ శంకరంపేట్ ఖండ కార్యవహ జైహింద్ రెడ్డి, ఖండ సహకార్యవహ సీతారాం, సీనియర్ బజరంగ్ దళ్ సభ్యులు సంగమేశ్వర్, గ్రామ మాజీ సర్పంచ్ బోయిని నారాయణ, గ్రామ పెద్దలు శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ సభ్యులు గ్రామస్తులు వివిధ గ్రామాల ఛత్రపతి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.