Alladurg : సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్త

సంత్ సేవాలాల్ మహారాజ్ గొప్ప సంఘ సంస్కర్తయే కాక ఆధ్యాత్మిక గురువని అల్లాదుర్గం (Alladurg) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొప్పుల శేషారెడ్డి అన్నారు. ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండలంలోని ఐబి తండా, గొల్ల కుంట తండాలలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకలను వచ్చిన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి సామాజిక సంస్కర్త మరియు ఆధ్యాత్మిక గురువుగా పరిగణిస్తారని తెలిపారు.

బంజారుల సంక్షేమం కోసం, అన్ని వర్గాల శ్రేయస్సు కోసం సంఘ సంస్కర్తగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుభాష్ రావు, గొ ల్ల కుంట తండా సర్పంచ్ మాన్యా నాయక్, ఐబి తండా మాజీ సర్పంచ్ రంజిత్, మీడియా కోఆర్డినేటర్ జైపాల్, పలు తాండల నాయకులు శంకర్ నాయక్, జైపాల్ నాయక్, గోపాల్ నాయక్, రాములు నాయక్, రాజు నాయక్, శీను నాయక్, రమేష్ నాయక్, వెంకట్ నాయక్, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.