Edupayala Jatara: నేటి నుంచి ఏడుపాయల జాతర ప్రారంభం

Edupayala Jatara: మెదక్ (Medak) జిల్లా పాపన్నపేట (Papannapet) మండలం నగ్సాన్ పల్లిలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత (vanadurga maatha) దేవాలయం మహాశివరాత్రి జాతరకు సర్వసిద్ధమైంది.

మహాశివరాత్రి జాతర ఉత్సవాలు నేటి నుంచి ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఇప్పటికే జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కావాల్సిన సదుపాయాలను కల్పించారు.

మొదటి రోజు (ఫిబ్రవరి 15 – మహాశివరాత్రి): మహాశివరాత్రి ఉపవాసాలు, భక్తులు మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, వనదుర్గా భవానిని దర్శించుకోవడంతో జాతర ప్రారంభమవుతుంది.

రెండవ రోజు (ఫిబ్రవరి 16 – బండ్ల ఉత్సవం): ఇది జాతరలోనే అత్యంత ప్రధాన ఘట్టం. భక్తులు తమ ఎడ్లబండ్లను రంగురంగుల పూలు, చీరలతో అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.

మూడవ రోజు (ఫిబ్రవరి 17 – రథోత్సవం): వైభవంగా జరిగే రథోత్సవంతో మూడు రోజుల మహాజాతర ముగుస్తుంది.

రాజగోపురం, ప్రధాన ఆలయం విద్యుత్ దీపాలు మరియు లేజర్ లైట్లతో సుందరంగా ముస్తాబయ్యాయి. సామాన్య భక్తుల కోసం భారీ క్యూలైన్లు, వీఐపీల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. మంజీరా నది తీరంలో స్నానపు షవర్లు, దుస్తులు మార్చుకునే గదులు, తాత్కాలిక టాయిలెట్లు సిద్ధం చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా కోసం అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు ఏర్పాటు చేశారు.