Agri:సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలి

Agri: సేంద్రియ ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయంపై ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు టేక్మాల్ మండల పరిధిలోని ఎల్లుపేట రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు ఆలోచించాలన్నారు. మన ఆరోగ్యం కొరకు, నేల ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయం చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. క్రిమి సంహారక మందులు వాడకుండా రైతులే స్వయంగా సేంద్రీయ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో వివరించారు.

Agri:సేంద్రియ ఎరువులను వినియోగించుకోవాలి

మన ఇంటి వ్యర్థాలు, మన పరిసర ప్రాంతాలలో ఉండే వ్యర్థాలను సేకరించి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని వాడుకోవాలన్నారు. సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా వర్మీ కంపోస్ట్, అగ్ని హస్త్రం, బ్రహ్మాస్త్రం, వావిలాకు కషాయం, వేప నూనె, ఆవు మూత్రం ఆవు పేడ నుండి సేంద్రీయ ఎరువులు తయారు చేసుకొని పంట పొలాలకు వాడుకోవడం మంచిదన్నారు. మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పథకాల గురించి చెప్పారు. రైతు నమోదు, యంత్ర పరికరాలు, యూరియా బుకింగ్ చేసుకోవడం గురించి అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ అధికారి హరీష్, Aeo మీనా కుమారి, రైతులు ఉన్నారు.