PaddyProcurement : అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను వట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ కొప్పుల లక్ష్మీ శేషారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సీతానగర్, రాంపూర్, కాయిదాంపల్లి, గడి పెద్దాపూర్, అల్లాదుర్గం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ (IKP) కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ కష్టార్జితాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

PaddyProcurement
ప్రభుత్వం గ్రేడ్-ఏ రకం వరికి ₹2,389, సాధారణ రకానికి ₹2,369 మద్దతు ధరగా నిర్ణయించిందని వెల్లడించారు. రైతులు నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలను సమర్పించి, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లయ్య, ఇంచార్జ్ ఎంపీడీవో చంద్రశేఖర్, ఏవో రాజేష్, ఏపీఎం రుక్మిణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొప్పుల శేషారెడ్డి, ఏఈఓ నవీన్, పంచాయతీ కార్యదర్శి అనిత, తదితరులు ఉన్నారు.