Mahaneeyula Jayanthi Celebrations : జోగిపేటలో మహనీయుల జయంతి ఉత్సవాలు.. టేక్మాల్‌లో పోస్టర్ ఆవిష్కరణ

Mahaneeyula Jayanthi Celebrations : భారతీయ సమాజానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని టేక్మాల్ మండల కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు మరియు బహుజన నాయకులతో కలిసి సభ నిర్వాహకులు ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఏప్రిల్ 13న భారీ బహిరంగ సభ Mahaneeyula Jayanthi Celebrations

ఈ సందర్భంగా సభ నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల ఏప్రిల్ 13న జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్‌లో బాబు జగజ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డా. బి.ఆర్. అంబేద్కర్ గారిల సంయుక్త జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా ప్రముఖ సామాజిక విశ్లేషకులు నలిగంటి శరత్ చామర్, అరుణ గోగులమండ హాజరవుతున్నట్లు వారు వెల్లడించారు.

విజయవంతం చేయాలని పిలుపు

మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ నిర్వహించే ఈ జయంతి కార్యక్రమానికి బహుజన బిడ్డలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో సభ నిర్వాహకులు అరిటిక్యాల శంకరయ్య, పొట్టిపల్లి మొగులయ్య, కాశపాగ ఇమ్మయ్య (సంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు), మహేందర్ (మెదక్ జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు), కాదులూరు మాజీ సర్పంచ్ యాదయ్య, కంది భాగయ్య, రొడ్డ సాయిలు, రమేష్ నాయక్, మసన్నగారి నాగరాజు, సంగమేష్, పొట్టిగాళ్ల మోహన్, అజ్జమర్రి లింగం, చింత అనిల్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.