Gold Rate : స్వల్పంగా దిగివచ్చిన పసిడి.. నేటి రేట్లు ఇవే!

Gold Rate : అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పసిడి మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆల్ టైమ్ గరిష్టాలను తాకిన బంగారం, వెండి ధరలు బుధవారం (ఏప్రిల్ 1న) ఉదయం స్వల్పంగా దిగివచ్చాయి. మంగళవారం ధరల్లో పెరుగుదల కనిపించినప్పటికీ, నేడు అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.

స్వల్పంగా దిగివచ్చిన పసిడి.. నేటి రేట్లు ఇవే!ఈ రోజు ఉదయం 6:00 గంటల సమయానికి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

నగరం24 క్యారెట్లు (10గ్రా)22 క్యారెట్లు (10గ్రా)
హైదరాబాద్రూ.1,49,520రూ.1,37,060
విజయవాడరూ.1,49,520రూ.1,37,060
ఢిల్లీరూ.1,49,670రూ.1,37,210
ముంబైరూ.1,49,520రూ.1,37,060
చెన్నైరూ.1,49,120రూ.1,36,690
బెంగళూరురూ.1,49,520రూ.1,37,060

బంగారంతో పాటు వెండి ధర కూడా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2.5 లక్షల రూపాయల మార్కు వద్ద కొనసాగుతోంది.

  • హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళ: రూ.2,49,900
  • ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు: రూ.2,50,100

ప్రధానంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను సురక్షిత నిధిగా భావించే బంగారం వైపు మళ్ళిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల ధరలు గరిష్టాల నుండి స్వల్పంగా తగ్గాయి. కొనుగోలుదారులు స్థానిక జ్యువెలరీ షాపుల్లో ధరలను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.