Damodar Rajanarsimha : సామాజిక కార్యకర్త ప్రకాష్‌ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Damodar Rajanarsimha : అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త ముప్పారం ప్రకాష్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. ఆందోల్ నియోజకవర్గం, డాకూర్ గ్రామానికి చెందిన ప్రకాష్ ప్రస్తుతం ఎల్‌బీనగర్‌లోని సహార ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Damodar Rajanarsimha  సామాజిక కార్యకర్త ప్రకాష్‌ను పరామర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

Damodar Rajanarsimha

ఆదివారం ఆసుపత్రికి చేరుకున్న మంత్రి, ప్రకాష్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. ముప్పారం ప్రకాష్‌కు అత్యుత్తమ మరియు మెరుగైన వైద్యాన్ని అందించాలని, ఆయన త్వరగా కోలుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అక్కడి వైద్యులను మంత్రి ఆదేశించారు. ప్రకాష్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.

మంత్రి వెంట రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణి (DMHO) డాక్టర్ లలిత, సహార ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నరేష్ తదితరులు ఉన్నారు.