ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కుసంగి గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి గ్రామంలో వాటర్ షెడ్ పథకంలో భాగంగా గతంలో 9 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారు. వారికి 75% సబ్సిడీ ద్వారా వచ్చిన బ్యాటరీ స్పెయర్లు,బ్రష్ కట్టర్లు లబ్ధిదారులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులు నూతన యాజమాన్య పద్ధతులను పాటించి వ్యవసాయం చేయాలన్నారు. పంట మార్పిడి చేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుబ్బారావు, సంబంధిత అధికారులు భగవాన్ రెడ్డి, రాజశేఖర్, రైతు ఉత్పత్తి సంఘం సీఈవో వెంకటేశం, మాజీ ఎంపీటీసీ సభ్యులు అంజయ్య, మాజీ సర్పంచ్ మొగుల్ రెడ్డి, వార్డు సభ్యులు వెంకట్ గౌడ్, దుర్గయ్య, అనిల్ గౌడ్, సతీష్, నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు డాకూరి లక్ష్మయ్య, ఎనగండ్ల మల్లేశం, పెద్దాపురం భూమయ్య, తలారి అడివయ్య, వీరారెడ్డి, కిష్టయ్య, పోల్కం శ్రీనివాస్, రవి, సాయిలు, ఆంజనేయులు గౌడ్, గజానంద్, కిరణ్ రెడ్డి, శ్రీకాంత్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.