మెదక్ జిల్లాలోని టేక్మాల్ గ్రామంలో గత మూడు రోజులుగా దుర్గమ్మ పోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
జాతర ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం బండి శిడి కార్యక్రమం కొనసాగింది. గొల్లగూడెం గ్రామం నుంచి డప్పుచప్పుళ్లులు, యువకుల డ్యాన్సులతో ఉత్సాహాంగా బండి శిడిని ఊరేగింపుగా వచ్చి అమ్మవార్ల దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

జాతర వేడుకల సందర్భంగా వానదేవుడు వీధినాటకం ప్రదర్శన జరుగుతుంది. సోమవారం రాత్రి ఈ నాటక ప్రదర్శన ప్రారంభమైంది. నేడు కూడా కొనసాగి రేపటితో ముగుస్తుంది.
దుర్గమ్మ పోచమ్మ జాతర లో కుస్తీ పోటీలు
నాల్గొవ రోజైన బుధవారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలతోపాటు మధ్యాహ్నాం కుస్తీ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలకు తెలంగాణలోని పలు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మల్లయోధులు పోటీలకు రానున్నారు. అదే రోజున రాత్రి రథోత్సవం ఉంటుంది.
