Tekmal : పాచిబండ్ల ఊరేగింపుతో ఘనంగా ముగిసిన దుర్గమ్మ, పోచమ్మ జాతర

Tekmal : ఐదు రోజులుగా ఘనంగా కొనసాగిన దుర్గమ్మ, పోచమ్మ గ్రామదేవతల జాతర ఉత్సవాలు పాచి బండ్ల ఊరేగింపుతో గురువారం ముగిశాయి.

Tekmal  పాచిబండ్ల ఊరేగింపుతో ఘనంగా ముగిసిన దుర్గమ్మ, పోచమ్మ జాతర

మెదక్ జిల్లా టేక్మాల్ లో ప్రతి సంవత్సరం హోళీ పండుగ తర్వాత ఐదవ రోజు నుంచి ఐదు రోజులపాటు జాతర ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా జరిపారు.

నాల్గవ రోజు కుస్తీ పోటీలు ముగిసిన అనంతరం రాత్రి రావణ దహనం, రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండు రోజులుగా వేస్తున్న వానదేవుడు వీధి నాటకం చివరి భాగం బుధవారం రాత్రి ప్రదర్శించారు. వానదేవుడు వీధి నాటకాన్ని చూడటానికి పరిసర గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చారు.

ముగిసిన Tekmal జాతర

ఐదవ రోజైన గురువారం ఉదయం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం పాచి బండ్లను అమ్మవార్ల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. దీంతో ఐదు రోజుల పాటు కొనసాగిన జాతర ఉత్సవాలు నేటితో ముగిశాయి.

Tekmal  పాచిబండ్ల ఊరేగింపుతో ఘనంగా ముగిసిన దుర్గమ్మ, పోచమ్మ జాతర