తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేం నరేందర్ రెడ్డి Vem Narender Reddyని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన నీలం మధు, నరేందర్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Vem Narender Reddy
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. “వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం దక్కడం ఆయన నిబద్ధతకు, పార్టీ పట్ల ఆయనకున్న నమ్మకానికి దక్కిన గౌరవం” అని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి గుర్తింపు ఉంటుందని ఈ ఎన్నిక మరోసారి నిరూపించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మాజీ కౌన్సిలర్ గుండ్ల మహేందర్ రెడ్డి, ఇస్నాపూర్ కౌన్సిలర్ సంగనగారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.