Agniveer Recruitment : ఇండియన్ ఆర్మీలో ‘అగ్నివీర్’ కొలువులు… లాస్ట్ డేట్ ఏప్రిల్ 1

Agniveer Recruitment : దేశ రక్షణలో భాగస్వాములు కావాలని కలలుగనే యువతకు భారత సైన్యం సువర్ణావకాశం కల్పిస్తోంది. భారత సైన్యంలో అగ్నివీర్ (Agniveer) రిక్రూట్‌మెంట్ – 2027 సంవత్సరానికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభమైంది. దేశ రక్షణలో పనిచేయాలనుకునే అర్హులైన యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఏప్రిల్ 1వ తేదీయే చివరి గడువు

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 2026, ఏప్రిల్ 1వ తేదీని చివరి గడువుగా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్‌లోని వివరాలను క్షుణ్ణంగా చదవుకోవాలి.

Agniveer Recruitment ఎంపిక ప్రక్రియ ఇలా..

అగ్నివీర్ నియామకాలు పారదర్శకత ఉంటాయి. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా మూడు దశలు ఉంటాయి.

  1. రాత పరీక్ష (Online CEE)
  2. శారీరక సామర్థ్య పరీక్షలు (Physical Fitness Test)
  3. వైద్య పరీక్షలు (Medical Test)

విద్యార్హతలు మరియు వయస్సు

  • విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 5 ప్రధాన సబ్జెక్టులలో కనీసం 45% మార్కులు ఉండటం తప్పనిసరి.
  • వయస్సు: 17½ ఏళ్ల నుండి 22 ఏళ్ల మధ్య ఉన్న వారు దరఖాస్తుకు అర్హులు.
  • శారీరక ప్రమాణాలు: ఎత్తు ప్రాంతానుసారం నిర్దేశించిన విధంగా ఉండాలి. ఛాతి కొలత కనీసం 77 సెం.మీ ఉండాలి (గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ విస్తరించి 82 సెం.మీ వరకు ఉండాలి).

మరిన్ని వివరాల కోసం మరియు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం వెంటనే భారత సైన్యం అధికారిక పోర్టల్‌ను సందర్శించండి.