శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని టేక్మాల్ లోని హనుమాన్ మందిరంలో వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా చందనోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతుడి విగ్రహానికి శాస్త్రోక్తంగా చందనం అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు.

Hanuman
అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదంగా బెల్లం పానకం పంపిణీ చేశారు. ఆలయ కమిటీ వారు చల్లని పానకాన్ని ఏర్పాటు చేయడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణమంతా రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.